‘ఈడబ్ల్యూఎస్‌’ అమలు చేయకుంటే బుద్ధిచెబుతాం

ABN , First Publish Date - 2020-11-25T07:50:35+05:30 IST

కేంద్రం ప్రకటించిన ఈడబ్ల్యూఎస్‌ కోటాను అమలు చేయడంలో కేసీఆర్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రెడ్డి సంఘాల నాయకులు ఆరోపించారు.

‘ఈడబ్ల్యూఎస్‌’ అమలు చేయకుంటే బుద్ధిచెబుతాం

 రెడ్డి సంఘాల నేతల హెచ్చరిక

బర్కత్‌పుర/హైదరాబాద్‌, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): కేంద్రం ప్రకటించిన ఈడబ్ల్యూఎస్‌ కోటాను అమలు చేయడంలో కేసీఆర్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రెడ్డి సంఘాల నాయకులు ఆరోపించారు. రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయకపోవడం, ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను అమలు చేయనందుకు నిరసనగా గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌సకు బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో రెడ్డి ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఏనుగు సంతో్‌షరెడ్డి, అసోసియేట్‌ అధ్యక్షుడు కె.రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎస్‌.తిరుపతిరెడ్డి, తెలంగాణ రెడ్డి హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు పుత్తూరి వెంకటరెడ్డి, ఓసీ సంక్షేమ సంఘం నాయకులు కె.రామారావు తదితరులు మాట్లాడారు.


నిజామాబాద్‌, దుబ్బాక ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌సకు ఏ విధంగా గుణపాఠం చెప్పామో అదే రీతిలో గ్రేటర్‌ ఎన్నికల్లోనూ గులాబీ పార్టీని ఓడించాలంటూ ఈ నెల 25న విస్తృత ప్రచారం నిర్వహిస్తామన్నారు. 


Updated Date - 2020-11-25T07:50:35+05:30 IST