రాష్ట్రంలో 70 మండలాల్లో అధిక నీటి వాడకం
ABN , First Publish Date - 2020-03-13T09:04:48+05:30 IST
రాష్ట్రంలో 70 మండలాల్లో అధిక నీటి వాడకం

న్యూఢిల్లీ, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని 584 మండలాల్లోని 70 మండలాల్లో (12 శాతం) అవసరానికి మించి నీటిని వినియోగిస్తున్నట్లు కేంద్ర భూగర్భ జల మండలి, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా 2017లో చేసిన అధ్యయనంలో తేలిందని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రతన్ లాల్ కఠారియా వెల్లడించారు. వార్షికంగా వినియోగించవలసిన దానికన్నా లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర మంత్రి గురువారం ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.