బొగ్గులవాగు ప్రాజెక్టు నీటి విడుదల
ABN , First Publish Date - 2020-12-31T04:03:34+05:30 IST
బొగ్గులవాగు ప్రాజెక్టు నీటి విడుదల

మల్హర్, డిసెంబరు 30 : భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం ఎడ్లపల్లిలోని భారీ మధ్య తరహా బొగ్గులవాగు ప్రాజెక్టు నీటిని బుధవారం ఎంపీపీ చింతలపల్లి మల్హల్‌రావు, వైస్ ఎంపీపీ బడితల స్వరూప విడుదల చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా యా సంగికి 2,350 ఎకరాలకు సాగు నీరందించనున్నట్లు ఐబీ అధికారులు తెలిపా రు. సర్పంచ్ జె.స్వరూప, పీఏసీఎస్ డైరెక్టర్ సంగెం రమేష్, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగిడి శ్రీనివాస్, వార్డు సభ్యుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.