ప్రతీ గ్రామాన్ని అభివృద్ధి చేస్తా: ఎమ్మెల్యే గండ్ర

ABN , First Publish Date - 2020-12-21T04:44:44+05:30 IST

ప్రతీ గ్రామాన్ని అభివృద్ధి చేస్తా: ఎమ్మెల్యే గండ్ర

ప్రతీ గ్రామాన్ని అభివృద్ధి చేస్తా: ఎమ్మెల్యే గండ్ర
వాటర్‌ప్లాంటును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే గండ్ర

చెల్పూరు, డిసెంబరు 20 : నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలో మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి పథాన నడిపిస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఆదివారం గణపురం మండలం పరుశురాంపల్లి పంచాయితీలో ఎన్‌ఎమ్‌ఆర్‌ విద్యాసంస్థల డైరెక్టర్‌ పబ్బతిరెడ్డి సంపత్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన వాటర్‌ప్లాంటును ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలోనే భూపాలపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుంచేందుకు కృషి చేస్తానన్నారు. గ్రామస్థుల తాగునీటి అవసరం దృష్ట్యా వాటర్‌ ప్లాంటు ఏర్పాటుచేయడం అభినందనీయమాన్నారు. సర్పంచ్‌ తాళ్లపల్లి మంజూల భాస్కర్‌రావు, పీఏసీఎస్‌ చైర్మన్‌ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, సర్పంచులు చెరుకుకుమారస్వామి, లక్ష్మీ, మానసశ్రీనివాస్‌, రవి, నాయకులు శివశంకర్‌ పొలుసాని లక్ష్మీ నరసింహారావు, మోతె కర్ణాకర్‌, ఉడుత సాంబయ్య, శ్రీనివాస్‌, మేకల రజిత పాల్గొన్నారు.  

Updated Date - 2020-12-21T04:44:44+05:30 IST