15 నుంచి శ్రీరాంసాగర్ ఆయకట్టుకు నీరు
ABN , First Publish Date - 2020-12-05T08:41:09+05:30 IST
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు డిసెంబరు 15 నుంచి నీటిని విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
నిజామాబాద్, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు డిసెంబరు 15 నుంచి నీటిని విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. యాసంగి సాగును దృష్టిలో పెట్టుకుని మార్చి 31 వరకు నీటి విడుదలను కొనసాగించనున్నారు.
ఆన్, ఆఫ్ పద్ధతిలో సుమారు 13 లక్షల ఎకరాలకు పైగా సాగునీటిని అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. కాల్వల వెంట అధికారులను నియమిస్తూ నీటి విడుదలకు సిద్ధమవుతున్నారు. ప్రాజెక్టు పరిధిలోని చివరి ఆయకట్టు వరకు నీటిని అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.