బాబ్లీ నుంచి ఎస్సారెస్పీకి నీటి విడుదల

ABN , First Publish Date - 2020-03-02T09:18:10+05:30 IST

మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు నుంచి రాష్ట్రంలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌కు ఆదివారం ఉదయం 0.6 టీఎంసీల నీటిని...

బాబ్లీ నుంచి ఎస్సారెస్పీకి నీటి విడుదల

నిర్మల్‌ కల్చరల్‌/మెండోర, మార్చి 1: మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు నుంచి రాష్ట్రంలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌కు ఆదివారం ఉదయం 0.6 టీఎంసీల నీటిని విడుదల చేశారు. ఏటా మార్చి 1న 0.6 టీఎంసీల నీరు విడుదల చేయాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.   బాబ్లీ ప్రాజెక్ట్‌ నీళ్లు విడుదల చేయడంతో రబీ పంటకు నీరందనుంది. ప్రస్తుతం శ్రీరాంసాగర్‌లో 51.860 టీఎంసీల నీళ్లున్నాయి. బాబ్లీ ప్రాజెక్టులో నీళ్లు 335 మీటర్ల ఎత్తుకి చేరాయి.

Updated Date - 2020-03-02T09:18:10+05:30 IST