వాటర్‌ బోర్డుకు రూ.3.95కే యూనిట్‌ విద్యుత్‌

ABN , First Publish Date - 2020-07-19T08:50:19+05:30 IST

గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు 13 మునిసిపాలిటీలు, 199 గ్రామాలకు తాగునీటిని అందిస్తోన్న హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ సప్లై సీవరేజీ బోర్డు (వాటర్‌బోర్డు)కు చెందిన...

వాటర్‌ బోర్డుకు రూ.3.95కే యూనిట్‌ విద్యుత్‌

హైదరాబాద్‌, జూలై 18 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు 13 మునిసిపాలిటీలు, 199 గ్రామాలకు తాగునీటిని అందిస్తోన్న హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ సప్లై సీవరేజీ బోర్డు (వాటర్‌బోర్డు)కు చెందిన పంపింగ్‌ స్టేషన్లకు వాడే యూనిట్‌ విద్యుత్‌కు రూ.3.95 వసూలు చేయాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(టీఎ్‌సఈఆర్సీ) నిర్ణయించింది. ఈ మేరకు శనివారం ఈఆర్సీ ఛైర్మన్‌ టి.శ్రీరంగారావు, సభ్యులు మనోహర్‌రాజు, కృష్ణయ్యలు ఉత్తర్వులు ఇచ్చారు. తాము వసూలు చేసే నీటి బిల్లులో సుమారు 75-80ు కరెంటు బిల్లులకే చెల్లిస్తున్నామని, యూనిట్‌ ధరను రూ.6.15సగటున వసూలు చేస్తున్నారని, దీనిని తగ్గించాలని వాటర్‌ బోర్డు ఎండీ ప్రభుత్వానికి నివేదించారు. ఈ విజ్ఙప్తికి  ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. 

Updated Date - 2020-07-19T08:50:19+05:30 IST