మునిసిపాలిటీలో అంతర్గత కలహాలు

ABN , First Publish Date - 2020-12-28T04:35:25+05:30 IST

అధికార పార్టీ కౌన్సిలర్ల మధ్య సమన్వయ లోపంతో ఎవరికి వారే యమునాతీరే అన్నట్లు సాగుతుండడంతో వర్ధన్నపేట పట్టణం అభివృద్ధికి నోచుకోవ డం లేదంటూ పట్టణవాసులు మండిపడుతున్నారు.

మునిసిపాలిటీలో అంతర్గత కలహాలు
వర్ధన్నపేట మునిసిపాలిటీ కార్యాలయం

 లెక్కలు బయటకు తీయాలంటున్న కౌన్సిలర్లు

అప్పులు తెచ్చి ఖర్చు చేశామంటున్న అధికారులు

వర్ధన్నపేట, డిసెంబరు 27: అధికార పార్టీ కౌన్సిలర్ల మధ్య సమన్వయ లోపంతో ఎవరికి వారే యమునాతీరే అన్నట్లు సాగుతుండడంతో వర్ధన్నపేట పట్టణం అభివృద్ధికి నోచుకోవ డం లేదంటూ పట్టణవాసులు మండిపడుతున్నారు. ఓ వార్డు లో చేసిన పనులకు బిల్లులు చేయాలని కౌన్సిలర్‌ పట్టుబట్టడంతో చైర్‌పర్సన్‌ ఇందుకు ససేమిరా అనడంతో వివాదానికి తెరలేసింది. అనుమతి లేకుండా అంతర్గత డ్రైనేజీ పైపులైన్‌ నిర్మాణం చేపట్టడం సరికాదని కౌన్సిల్‌ తీర్మానం లేకుండా ఎలా చేస్తారనే వాదనను మరికొందరు వినిపించడంతో వ్యక్తిగత దూషణల వరకు వెళ్లినట్టు తెలుస్తోంది. పనులన్ని సక్రమంగా చేస్తున్నారా అంటూ వాగ్వాదానికి దిగడంతో కమిషనర్‌ సభ్యులకు సర్ది చెప్పేయత్నం చేసినా ఇరువర్గాలు శాంతించకపోవడంతో దుమారం రేగినట్లు సమాచారం. సందట్లో సడేమియాలాగా రైతు వేదిక నిర్మించేందుకు పాత వ్యవసాయ గిడ్డంగిని కూల్చివేసిన సమయంలో పైకప్పు టేకు కలప మాయం తెలిసిందే. మునిసిపాలిటీలో అన్నీ తానై నడిపిస్తున్న వ్యక్తి ద్వారానే ప్రతిపక్షాలకు కొందరు టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లే కీలక సమాచారం చేరవేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. కౌన్సిల్‌లో కీలక బాధ్యతలో ఉన్న ప్రజాప్రతినిధి ప్రతిష్టకు భంగం కలిగి ఓ ఉద్యోగిని మందలించగా సదరు ఉద్యోగి రెండు వారాలపాటు విధులకు హాజరుకాలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి.  

మునిసిపాలిటీగా ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు లక్షలాది రూపాయలు అప్పులు తెచ్చి ఖర్చు చేశామంటూ కమిషనర్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌లు కౌన్సిల్‌ ఎదుట తీర్మానం పెట్టారు. ఖర్చు చేసిన నిధుల వివరాలు స్పష్టంగా లేవని, ఈ విషయంపై కలెక్టర్‌, మునిసిపల్‌ శాఖ ఉన్నతాధికారులు, మంత్రి కేటీఆర్‌కు విచారణ జరిపించాలని కౌన్సిలర్లు ఫిర్యాదు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. 

కాగా మునిసిపాలిటీలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటి నిర్మాణాల్లో అవినీతి రాజ్యమేలుతుందని, ఆపరేటరే అన్నీతానై వ్యవహరిస్తుండడంపై కౌన్సిల్‌ సభ్యులు గుర్రుగా ఉందని, ఎవరి ఇష్టానుసారం వారు వ్యవహరిస్తున్నారని కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అనుమతి లేకుండా నిర్మించిన ఇంటికి జరిమానా విధించే

Updated Date - 2020-12-28T04:35:25+05:30 IST