వరంగల్‌లో విషాదం

ABN , First Publish Date - 2020-05-11T14:43:50+05:30 IST

వరంగల్‌లో విషాదం

వరంగల్‌లో విషాదం

వరంగల్: రెండు కుటుంబాల మధ్య భూ తగాదా ఒకరి ప్రాణాలను బలిగొంది. జిల్లాలోని నర్సంపేట మండలం ఇటుకాలపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గత రాత్రి భూ తగాదా విషయంలో గ్రామంలోని రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో పొసరపు రాజయ్య కుటుంబంపై  అనుముల మల్లయ్య కుటుంబం రాళ్ళతో దాడికి తెగబడింది. ఈ ఘటనలో చుట్టపు చూపుగా రాజయ్య ఇంటికి వచ్చిన కూతురు లత(36) తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను నర్సంపేట ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో వరంగల్‌కు తరలించారు. కాగా చికిత్స పొందుతూ లత మృతి చెందింది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతురాలు లత స్వస్థలం నల్లబెల్లి మండలం గొల్లపల్లి గ్రామంగా తెలుస్తోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 


Updated Date - 2020-05-11T14:43:50+05:30 IST