వరంగల్: మహిళపై ఉపసర్పంచ్ దాడి
ABN , First Publish Date - 2020-04-28T15:12:40+05:30 IST
వరంగల్: మహిళపై ఉపసర్పంచ్ దాడి

వరంగల్ అర్బన్: ప్రజల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ఓ ఉపసర్పంచ్ పట్టపగలే ఓ మహిళపై దాడి చేసిన ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని ఐనవోలు మండలం రాంపూర్ గ్రామ ఉపసర్పంచ్ సుధాకర్ వీరంగం సృష్టించారు. ఖాళీ స్థలం తనకు ఇవ్వాలంటూ మహిళపై ఉపసర్పంచ్ దాడికి ఒడిగట్టారు. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఉపసర్పంచ్ సుధాకర్ ఈ దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా ఉపసర్పంచ్ సుధాకర్ అధికార పార్టీ నేతగా తెలుస్తోంది. దీంతో ఈ ఘటనపై పోలీసులు ఏ మేరకు చర్యలు తీసుకుంటారనేది చర్చనీయాంశమైంది.