హైదరాబాద్: రాత్రంతా కరెంట్ లేక నగరవాసుల ఇక్కట్లు
ABN , First Publish Date - 2020-10-14T17:58:48+05:30 IST
భారీ వర్షానికి హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది.

హైదరాబాద్: భారీ వర్షానికి హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. రాత్రంతా కరెంట్ లేక నగరవాసులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో అపార్టుమెంట్లు సెల్లార్లలోకి వరద నీరు చేరడంతో వాహనాలు నీట మునిగాయి. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని జనాలు చెబుతున్నారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని, కష్ట సమయంలో అందరూ కలిసి ముందుకు వెళ్లాలని అధికారులు సూచించారు.
నగరంలో ఇలా ఉంటే.. జిల్లాల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వరంగల్‌లో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కాలనీలను ముంచెత్తుతోంది. జనజీవనం స్తంభించింది. ఆగస్టు నెలలో ఎన్నడూ లేని విధంగా వరదలు వరంగల్ నగరాన్ని ముంచెత్తాయి. మళ్లీ ఇప్పుడు అదే పరిస్థితి కొనసాగుతోంది. రోడ్లపై వరదనీరు పారుతుండడంతో కాలనీ వాసులు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. వరంగల్ నగరంలో శ్రీనివాసకాలనీ, గాంధీనగర్, తమ్మయినగర్, బాలసముద్రం, ఎన్టీఆర్ నగర్ తదితర కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.