ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్

ABN , First Publish Date - 2020-04-25T16:02:33+05:30 IST

వరంగల్: వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కరోనా లాక్‌డౌన్ కొనసాగుతోంది.

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్

వరంగల్: వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కరోనా లాక్‌డౌన్ కొనసాగుతోంది. రాత్రి కురిసిన వడగళ్ల వానతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. జనగామ జిల్లాలో వడగళ్ల వాన తీవ్ర ప్రభావం చూపింది. పాలకుర్తి, జాఫర్ గడ్, లింగాల ఘనపురం మండలాల్లోని ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం, మొక్కజొన్న బస్తాలు పెద్ద సంఖ్యలో తడిసిపోయాయి. ఎలాంటి ఆంక్షలు లేకుండా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - 2020-04-25T16:02:33+05:30 IST