తండ్రి అంత్యక్రియలను నెట్‌లోనే చూస్తూ కన్నీటి పర్యంతం

ABN , First Publish Date - 2020-03-25T22:10:02+05:30 IST

తండ్రి అంత్యక్రియలను నెట్‌లోనే చూస్తూ కన్నీటి పర్యంతం

తండ్రి అంత్యక్రియలను నెట్‌లోనే చూస్తూ కన్నీటి పర్యంతం

వరంగల్‌ అర్బన్‌: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ధర్మసాగర్‌ మండలం నారాయణగిరిలో అనారోగ్యంతో ప్రభాకర్‌రెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు. ఆస్ట్రేలియాలో కుమారుడు, బెంగళూరులో ప్రభాకర్‌రెడ్డి కూతురు ఉన్నారు. కుమారుడు, కూతురు స్వగ్రామానికి రాలేకపోవడంతో భార్యే అన్నితానై అంత్యక్రియలు నిర్వహించింది. అలాగే కరోనా భయంతో అంత్యక్రియలకు బంధువులు కూడా హాజరుకాలేదు. తండ్రి అంత్యక్రియలను నెట్‌లోనే చూస్తూ ప్రభాకర్‌రెడ్డి పిల్లలు కన్నీటి పర్యంతమైయ్యారు. దీంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. చివరిసారిగా తన పిల్లలు కన్న తండ్రి ముఖం కూడా చూసుకోలేని పరిస్థితి ఏర్పడిందని గుండెలు బాదెల రోదించింది. ఇలాంటి పరిస్థితి ఏ ఒక్కరికి రాకూడదని కన్నీరుమున్నీరుగా  ఆమె రోదించిన తీరు గ్రామంలో వారిని  సైతం కంటతడి పెట్టించింది. 

Read more