ఛలో‌ బస్‌భవన్‌కు బస్ యజమానుల పిలుపు

ABN , First Publish Date - 2020-09-21T14:33:38+05:30 IST

పెండింగ్‌లో ఉన్న అద్దె బస్సుల బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఛలో బస్ భవన్ ముట్టడికి అద్దె బస్సుల యజమానుల పిలుపునిచ్చారు.

ఛలో‌ బస్‌భవన్‌కు బస్ యజమానుల పిలుపు

వరంగల్ అర్బన్: పెండింగ్‌లో ఉన్న అద్దె బస్సుల బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఛలో బస్ భవన్ ముట్టడికి అద్దె బస్సుల యజమానుల పిలుపునిచ్చారు. ఈ మేరకు హైదరాబాద్‌కు తరలివెళ్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. బస్సులను తిప్పిన కూడా...బిల్లులను చెల్లింపు చేయటంలో నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం బిల్లులను చెల్లించాలని కోరితే అరెస్టులు చేయటం అన్యాయమని బస్సుల యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2020-09-21T14:33:38+05:30 IST