మాస్క్‌ ధరించకుంటే జేబుకు చిల్లే

ABN , First Publish Date - 2020-05-10T10:06:35+05:30 IST

రాష్ట్రంలో మాస్క్‌ల ధారణ తప్పనిసరి చేస్తూ జారీ చేసిన జీవో నంబరు 64తో అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ముఖాన్ని తప్పనిసరిగా తువ్వాలు...

మాస్క్‌ ధరించకుంటే జేబుకు చిల్లే

వనపర్తిలో 42 వేలు వసూలు


హైదరాబాద్‌, మే 9 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో మాస్క్‌ల ధారణ తప్పనిసరి చేస్తూ జారీ చేసిన జీవో నంబరు 64తో అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ముఖాన్ని తప్పనిసరిగా తువ్వాలు/కర్చీ్‌ఫతో కప్పుకోవడం, మాస్కును ధరించడం వంటివి చేయాలని, లేకపోతే రూ.వెయ్యి జరిమానా విధించాలని నిర్దేశిస్తూ ఈనెల 7న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ జీవో జారీ చే సిన విషయం విదితమే. శనివారం వనపర్తిలో ఒక్కరోజే 42 మంది నుంచి రూ.42 వేల జరిమానా వసూలు చేశారు. జనగామ జిల్లాలో కూడా 16 మందికి పెనాల్టీ విధించారు. 

Updated Date - 2020-05-10T10:06:35+05:30 IST