కాస్తు భూములకు పట్టాలందించాలి

ABN , First Publish Date - 2020-12-29T04:31:02+05:30 IST

కాస్తు భూములకు పట్టాలందించాలి

కాస్తు భూములకు పట్టాలందించాలి

ములుగు కలెక్టరేట్‌, డిసెంబరు 28: జిల్లాలో పేదలు కాస్తు చేస్తున్న భూములకు పట్టాలందించాలని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు జి.నాగయ్య డిమాండ్‌ చేశారు. ములుగు జిల్లా కేంద్రంలో సోమవారం తుమ్మల వెంకటరెడ్డి అధ్యక్షతన భూ సదస్సు జరగగా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని వెంకటాపూర్‌, పట్వారిపల్లి, రామచంద్రాపురం, రాంపూర్‌, కత్తిగూడెం తదితర గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ భూములు 40ఏళ్లుగా పేదల కాస్తు కబ్జాలో ఉన్నప్పటికీ పట్టాలు ఇవ్వకుండా వారి  హక్కులను ప్రభుత్వం కాలరాస్తుందని అన్నారు. అదేవిధంగా కేశవాపూర్‌, నర్సాపూర్‌, చక్రవర్తిపల్లి, శివాపురం, జాకారం, సోమలగడ్డ, కొప్పుసూరు తదితర గ్రామాల్లో రెవెన్యూ అధికారులు పట్టాలిచ్చినప్పటికీ ఫారెస్టు అధికారులు రైతులను ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. ఆ భూములపై జాయింట్‌ సర్వే నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం నాయకులు, రైతులు నినాదాలు చేస్తూ జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్‌కు చేరుకుని అదనపు కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభికి వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు సూడి కృష్ణారెడ్డి, నాయకులు గఫూర్‌పాషా, అమ్జద్‌పాషా, దబ్బకట్ల లక్ష్మయ్య, రత్నం రాజేందర్‌, పొదిళ్ల చిట్టిబాబు, రామస్వామి, ముత్తయ్య, ప్రవీణ్‌, నటరాజ్‌, దామోదర్‌, కుమారస్వామి, రవీందర్‌, పెద్ద సంఖ్యలో పేద రైతులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-29T04:31:02+05:30 IST