‘ఎమ్మెల్యే వివేకానంద్‌పై చర్యలు తీసుకోండి...’
ABN , First Publish Date - 2020-10-07T12:28:00+05:30 IST
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందపై చర్యలు తీసుకోవాలంటూ గాజులరామారం వీఆర్వో శ్యాంకుమార్ మల్కాజిగిరి పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశాడు. మల్కాజిగిరి

హైదరాబాద్ : కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందపై చర్యలు తీసుకోవాలంటూ గాజులరామారం వీఆర్వో శ్యాంకుమార్ మల్కాజిగిరి పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశాడు. మల్కాజిగిరి సత్యరాఘవేంద్ర కాలనీకి చెందిన శ్యాంకుమార్ కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం వీఆర్వోగా పనిచేస్తున్నారు. ఈనెల 3న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సర్వేనంబర్ 79లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలో పాల్గొన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. మరుసటి రోజు 4న తాను ఇంట్లో ఉండగా, ఎమ్మెల్యే వివేకానంద ఫోన్‌లో అసభ్యపదజాలంతో దూషించడమే కాకుండా, తనపై అవినీతి ఆరోపణలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తనకు న్యాయం చేయాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ విషయంపై పోలీసులు స్పందించలేదు. ఫిర్యాదు వచ్చిందని మాత్రం తెలిపారు.