ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనానికి స్పందించిన స్వచ్ఛంద సంస్థలు

ABN , First Publish Date - 2020-04-07T17:49:53+05:30 IST

రెక్కాడితేగానీ డొక్కాడని వారికి స్వచ్ఛంద సంస్థలు ఆహారాన్ని పంపిణీ చేస్తున్నాయి.

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనానికి స్పందించిన స్వచ్ఛంద సంస్థలు

హైదరాబాద్: రెక్కాడితేగానీ డొక్కాడని వారికి స్వచ్ఛంద సంస్థలు ఆహారాన్ని పంపిణీ చేస్తున్నాయి. ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన కథనానికి స్పందించిన కొన్ని స్వచ్ఛంద సంస్థలు వారికి భోజన ఏర్పాట్లు చేశాయి. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా ఐడీఏబొల్లారంలో వలస కార్మికులు కూలి పనులు చేసుకుంటూ నివసిస్తున్నారు. ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా పనులు లేక భోజనం లేక ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై నిన్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చేసిన ప్రసారంపై స్థానిక నేతలు, స్వచ్చంద సంస్థలు స్పందించి.. ఇవాళ వారికి భోజన ఏర్పాట్లు చేశారు. లాక్ డౌన్ పూర్తి అయ్యేవరకు కూలీలకు భోజనాలు పెడతామని వారు ఏబీఎన్‌కు తెలిపారు.

Read more