శభాష్‌ సాయిశశాంక్‌

ABN , First Publish Date - 2020-03-21T10:07:00+05:30 IST

ఇటీవల విదేశాల నుంచి నగరానికి వచ్చిన వాళ్లు క్వారంటైన్‌ భయంతో తమ వివరాలను దాచేస్తుంటే.. ఓ వ్యక్తి మాత్రం బాధ్యతాయుతంగా ప్రవర్తించాడు.

శభాష్‌ సాయిశశాంక్‌

స్వచ్ఛందంగా కరోనా పరీక్షలకు హాజరు

 రాంనగర్‌, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): ఇటీవల విదేశాల నుంచి నగరానికి వచ్చిన వాళ్లు క్వారంటైన్‌ భయంతో తమ వివరాలను దాచేస్తుంటే.. ఓ వ్యక్తి మాత్రం బాధ్యతాయుతంగా ప్రవర్తించాడు. నల్లకుంట పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని విద్యానగర్‌కు చెందిన సాయిశశాంక్‌ ఇటీవల ఇటలీ నుంచి నగరానికి వచ్చాడు. మార్చి 1 తర్వాత విదేశాల నుంచి నగరానికి వచ్చిన వారందరూ స్వచ్ఛందంగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం ఇచ్చిన పిలుపుకు అతడు స్పందించాడు. తనకు కరోనా పరీక్షలు చేయాలని అధికారులను కలిసి కోరాడు. అతడిని అధికారులు అభినందించారు.

Updated Date - 2020-03-21T10:07:00+05:30 IST