17న వర్చువల్‌ బహిరంగ సభ

ABN , First Publish Date - 2020-09-14T09:10:59+05:30 IST

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఈ నెల 17న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బీజేపీ కార్యాలయాలు, ప్రతి పోలింగ్‌ బూత్‌లో జాతీయ జెండా ఎగురవేయనున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన

17న వర్చువల్‌ బహిరంగ సభ

  • మోదీ జన్మదినం సందర్భంగా నేటి నుంచి సేవా ఉత్సవాలు  
  • బీజేపీ ప్రధాన కార్యదర్శులు ప్రేమేందర్‌రెడ్డి, శృతి  

హైదరాబాద్‌, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఈ నెల 17న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బీజేపీ కార్యాలయాలు, ప్రతి పోలింగ్‌ బూత్‌లో జాతీయ జెండా ఎగురవేయనున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జి. ప్రేమేందర్‌రెడ్డి, బంగారు శృతి తెలిపారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు వర్చువల్‌ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. సభకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో పాటు మరో కేంద్ర మంత్రి ముఖ్య అతిథులుగా హాజరవుతారన్నారు. ఆదివారం వారు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ప్రధాని మోదీ 70వ జన్మదినం సందర్భంగా సోమవారం నుంచే సేవా ఉత్సవాలు ప్రారంభిస్తున్నామని తెలిపారు. అభివృద్ధిని అడ్డుకునేలా టీఆర్‌ఎస్‌ నాయకులు రామగుండంలో కేంద్ర మంత్రుల పర్యటన సందర్భంగా ధర్నాలు చేశారని ప్రేమేందర్‌రెడ్డి మండిపడ్డారు. టీ-హబ్‌, ఔషధనగరిలో ఎంతమంది స్థానికులకు ఉద్యోగాలిచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-09-14T09:10:59+05:30 IST