కోవిడ్-19 నిబంధనలను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు: కలెక్టర్

ABN , First Publish Date - 2020-07-23T02:01:56+05:30 IST

కోవిడ్-19 నిబంధనలను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ హెచ్చరించారు. అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

కోవిడ్-19 నిబంధనలను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు: కలెక్టర్

కామారెడ్డి: కోవిడ్-19 నిబంధనలను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ హెచ్చరించారు. అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించేలా, సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేసి జరిమానాలు విధించాలన్నారు. అవసరమైతే దుకాణాల లైసెన్సులు రద్దు చేయాలని ఆదేశించారు. జనం రద్దీ ఎక్కువగా ఉండే చోట్ల నిఘా పెంచాలని, అనుమతి ఉన్న వివాహాలు మినహాయించి.. ఏలాంటి ఫంక్షన్‌లు, పార్టీలు జరగకుండా చూడాలి కలెక్టర్ శరత్ సూచించారు.

Updated Date - 2020-07-23T02:01:56+05:30 IST