పోతిరెడ్డిపాడును బయట పెట్టిందే టీఆర్ఎస్ : వినోద్

ABN , First Publish Date - 2020-05-17T18:03:06+05:30 IST

పోతిరెడ్డిపాడును బయట పెట్టిందే టీఆర్ఎస్ అని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ పేర్కొన్నారు.

పోతిరెడ్డిపాడును బయట పెట్టిందే టీఆర్ఎస్ : వినోద్

కరీంనగర్/హైదరాబాద్ : పోతిరెడ్డిపాడును బయట పెట్టిందే టీఆర్ఎస్ అని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం నాడు కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రతిపక్షాల తీరు తాతకు దగ్గు నేర్పినట్టు ఉందని విమర్శలు గుప్పించారు. బీజేపీ, కాంగ్రెస్‌లు టీఆర్ఎస్‌కు చెప్పేటంత అయ్యారా..? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.


వినోద్ ప్రశ్నల వర్షం..

పోతిరెడ్డిపాడు అనే ఊరు ఉందని వీళ్ళకు తెలుసా..?. ఇప్పుడు మాట్లాడే వాళ్లంతా అప్పుడు మంత్రులుగా లేరా..?. పోతిరెడ్డి పాడుకు వ్యతిరేకంగా ఉద్యమం చేసింది టీఆర్ఎస్ కాదా..?. పార్లమెంట్‌లో గొంతు ఎత్తిన ఏకైక పార్టీ టీఆర్ఎస్. కాంగ్రెస్ నేతలకు మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది.?. పోతిరెడ్డిపాడును తవ్వింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాదా..? అని వినోద్ ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడే ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని వినోద్ చెప్పుకొచ్చారు.

Updated Date - 2020-05-17T18:03:06+05:30 IST