హెచ్‌సీయూ ప్రవేశ పరీక్ష తేదీలను మార్చాలి
ABN , First Publish Date - 2020-09-16T09:13:16+05:30 IST
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఈ నెల 24 నుంచి 26 వరకు నిర్వహించే పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షల ..

వీసీకి వినోద్ కుమార్ లేఖ
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఈ నెల 24 నుంచి 26 వరకు నిర్వహించే పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షల తేదీలు మార్చాలంటూ హెచ్‌సీయూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ అప్పారావుకు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ మంగళవారం లేఖ రాశారు. ఈ లేఖ ప్రతిని యూజీసీ చైర్మన్‌కు కూడా పంపారు. హెచ్‌సీయూలో ఏక కాలంలో పలు పరీక్షల నిర్వహణ వల్ల విద్యార్థుల విలువైన విద్యా సంవత్సరానికి నష్టం జరుగుతుందని, వారికి ఇబ్బందులు కలుగుతాయని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులకు ఫైనల్ ఇయర్/చివరి సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 22 నుంచి అక్టోబర్ 13వ తేదీ వరకు జరుగనున్నాయని తెలిపారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) కూడా యూజీసీ నెట్ పరీక్షలను ఈ నెల 24వ తేదీ నుంచి నిర్వహించనుందన్నారు.