పల్లె ప్రగతి పనులు త్వరగా పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2020-12-11T04:45:51+05:30 IST

పల్లె ప్రగతి పనులు త్వరగా పూర్తి చేయాలి

పల్లె ప్రగతి పనులు త్వరగా పూర్తి చేయాలి

తరిగొప్పుల, డిసెంబరు 10: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేయాలని అదనపు కలెక్టర్‌ అబ్దుల్‌ హమీద్‌ అధికారులను ఆదేశించారు.  మండలంలోని అక్కరాజుపల్లిలో  గురువారం సర్పంచ్‌ అమిరిశెట్టి వీరేందర్‌ అధ్యక్షతన ఏర్పాటుచేసిన గ్రామ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పల్లె ప్రగతి పనుల పురోగతిపై పంచాయతీ పాలకవర్గం, అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ జొన్నగోని అరిత, డీఎల్‌పీవో గంగభవాని, ప్రత్యేకాధికారి రాజేంద్ర ప్రసాద్‌, ఇన్‌చార్జి ఎంపీడీవో దేవేందర్‌రెడ్డి, ఎంపీవో మల్లయ్య, పీఆర్‌ ఏఈ ప్రవీణ్‌, ప్రశాంత్‌, ఏపీవో లింగయ్య, పంచాయతీ కార్యదర్శి అమరేందర్‌రెడ్డి, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-11T04:45:51+05:30 IST