గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతతో ఉండాలి

ABN , First Publish Date - 2020-03-13T11:39:39+05:30 IST

మండలంలో కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌ గురువారం పర్యటించారు. చల్లగరిగలో నిలిచిపోయిన డబుల్‌ బెడ్‌రూం

గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతతో ఉండాలి

కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌


చిట్యాల, మార్చి 12: మండలంలో కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌ గురువారం పర్యటించారు. చల్లగరిగలో నిలిచిపోయిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను పరిశీలించారు. ఇళ్ల నిర్మాణం పూర్తి కాక ప్లాస్టిక్‌ కవర్లు కప్పుకుని, గు డిసెల్లో నివసిస్తున్నట్లు లబ్ధిదారులు కలెక్టర్‌తో మొరపెట్టుకున్నారు. పింఛన్‌ రావడం లేదని పలువురు ఆయన తెలి పారు. వెంటనే పంచాయతీరాజ్‌ ఈఈ రాంబాబుతో మాట్లాడి ‘డబుల్‌’ ఇళ్ల పనుల్లో వేగం పెంచాలని ఆదేశించా రు. గ్రామానికి చెందిన కొల్లేరి సమ్మ య్య, లక్ష్మికి పింఛన్‌ మంజూరి చేయాలన్నారు. డ్రైనేజీల్లో చెత్తచెదారం పేరుకుపోయి ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవో, ఎంపీవోలకు మెమో లు జారీ చేస్తున్నట్లు తెలిపారు. సా యంత్రంలోగా గ్రామాన్ని శుభ్రంగా చే యకపోతే సస్పెండ్‌ చేస్తానని హెచ్చరించారు. అనంతరం తిర్మళాపురంలో పంచాయతీ భవనాన్ని పరిశీలించారు. చిట్యాలలోని డ్రెయినేజీల పరిస్థితిని గమనించారు. 


మండలకేంద్రంలోని పశువైద్యశాల ను కలెక్టర్‌ తనిఖీ చేశారు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కుమారస్వామి గైర్హాజరవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి బాలకృష్ణ తో ఫోన్‌లో మాట్లాడారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏడీ కుమారస్వామికి మెమో జారీ చేయాలని ఆదేశించారు. అలాగే సామాజిక ఆస్పత్రిని సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్పత్రిలోని ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది తమకు ఏడు నెలలుగా వేతనాలు రావడం లేదని ఆయనకు వినతిపత్రం అందజేశారు.


ఐదుగురికి మెమోలు..

చల్లగరిగ సర్పంచ్‌ కర్రె మంజుల, ఎంపీడీవో నాగలక్ష్మి, ఇన్‌చార్జి మండల పంచాయతీ అధికారి శంకర్‌రావు, పం చాయతీ కార్యదర్శి బాబురావు, వెటర్నరీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కుమారస్వామిలకు కలెక్టర్‌ మెమోలు జారీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ వినోద, జడ్పీటీసీ సాగర్‌, తహసీల్దార్‌ షరీ ఫ్‌ మోహియిద్దీన్‌, ఏపీవో అలీంపాషా, ఎంపీటీసీలు కట్కూరి పద్మ నరేందర్‌, దబ్బెట అనిల్‌, తదితరులున్నారు. 

Updated Date - 2020-03-13T11:39:39+05:30 IST