విక్రమ్‌గౌడ్‌కు బుజ్జగింపులు.. రేపు నడ్డా సమక్షంలో బీజేపీలోకి..
ABN , First Publish Date - 2020-11-27T00:17:23+05:30 IST
గ్రేటర్ ఎన్నికల వేళ పలువురు నేతలు బీజేపీలో చేరుతుండడంతో కమలం పార్టీ ఫుల్ జోష్‌లో ఉంది. కాంగ్రెస్‌లో అసంతృప్తితో ఉన్న నాయకులను ..

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల వేళ పలువురు నేతలు బీజేపీలో చేరుతుండడంతో కమలం పార్టీ ఫుల్ జోష్‌లో ఉంది. కాంగ్రెస్‌లో అసంతృప్తితో ఉన్న నాయకులను బీజేపీలో చేర్చుకునేందుకు ఆ పార్టీలోని సీనియర్ నాయకులు పావులు కదుపుతున్నారు. గ్రేటర్లో మంచి పట్టున్న నేతలు చేరితే పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని ఆ నాయకులు అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు విక్రమ్‌గౌడ్‌ను గురువారం మధ్యాహ్నం బీజేపీ సీనియర్ నేత, మాజీమంత్రి డీకే అరుణ బీజేపీలోకి రావాలని ఆహ్వానించారు. ఈసందర్భంగా విక్రమ్‌గౌడ్ కూడా బీజేపీలోకి వెళ్లడానికి సముఖత వ్యక్తం చేశాడు.
అసంతృప్తితో బీజేపీలోకి..
బీజేపీలోకి వెళ్లనున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు విక్రమ్‌గౌడ్‌ను బుజ్జగించేందుకు ఆపార్టీ నేతలు రంగంలోకి దిగారు. ఆయన పార్టీ మారితే బీజేపీ గ్రేటర్లో మరింత పుంజుకునే అవకాశం ఉంది. గురువారం మధ్యాహ్నం జాంబాగ్‌లోని విక్రమ్‌గౌడ్ కార్యాలయానికి వి. హనుమంతురావు వెళ్లి ఆయనతో మాట్లాడారు. పార్టీలో తనకు తగిన గౌరవం ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తండ్రి ముఖేష్‌గౌడ్ హాస్పిటల్లో ఉంటే పార్టీ నేతలు కనీసం పట్టించుకోలేదని విక్రమ్‌గౌడ్ ఆగ్రహం చెందారు. అంతేగాకుండా విక్రమ్‌గౌడ్‌కు రాజనర్సింహ, సీతక్క ఫోన్ చేసి బుజ్జగించారు. గౌరవం లేని చోట ఉండలేనని విక్రమ్‌గౌడ్ చెప్పారు. రేపు సాయంత్రం నడ్డా సమక్షంలో బీజేపీలో చేరతానని అన్నారు.