చిన్నారులపై తండ్రి పైశాచికం

ABN , First Publish Date - 2020-09-24T09:30:47+05:30 IST

బాధ్యత మరచిన ఆ తండ్రి మద్యానికి బానిసయ్యాడు. భార్య, పిల్లలను నిత్యం కొట్టడమే పనిగా పెట్టుకున్నాడు.

చిన్నారులపై తండ్రి పైశాచికం

వికారాబాద్‌, సెప్టెంబరు 23: బాధ్యత మరచిన ఆ తండ్రి మద్యానికి బానిసయ్యాడు. భార్య, పిల్లలను నిత్యం కొట్టడమే పనిగా పెట్టుకున్నాడు. వికారాబాద్‌ జిల్లా పరిగి నియోజకవర్గం దోమ మండలం ఊట్‌పల్లి గ్రామానికి చెందిన నజీమా బేగంతో అజీమోద్దీన్‌కు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు ఆడపిల్లలు. నజీమోద్దీన్‌ వికారాబాద్‌ ఆర్టీసీలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. వికారాబాద్‌ రాజీవ్‌ గృహకల్పలో అద్దె ఇంట్లో కుటుంబంతో జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసై భార్యతో రోజూ గొడవపడుతున్నాడు. పిల్లలను రోజు కొడుతున్నాడు. బుధవారం సైతం చిన్న కూతురును ఇష్టంవచ్చినట్లు కొట్టి, ముఖంపై ఉమ్మివేశాడు. ఈ ఘటనను వీడియో తీసిన నజీమాబేగం.. పోలీసులు, సఖి కేంద్రాన్ని ఆశ్రయించింది. నజీమోద్దీన్‌కు కౌన్సెలింగ్‌ ఇస్తామని, ఈ ఘటనపై విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని సఖి జిల్లా అధికారి అనితారెడ్డి హామీ ఇచ్చారు. 

Updated Date - 2020-09-24T09:30:47+05:30 IST