నగరంలో ఉండరని తెలిసీ పోలింగ్ పెట్టారు: విజయశాంతి
ABN , First Publish Date - 2020-12-02T01:00:00+05:30 IST

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల నిర్వహణలో టీఆర్‌ఎస్ కుట్రపూరితంగా వ్యవహరించిందని ప్రముఖ రాజకీయ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. పోలింగ్ శాతం తగ్గడం ఆవేదన కలిగిస్తోందన్నారు. ప్రభుత్వం, ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయని చెప్పారు. వరుస సెలవులతో ఎక్కువ మంది నగరంలో ఉండరని తెలిసీ పోలింగ్ పెట్టారని ఆరోపించారు. ప్రభుత్వం వ్యూహాత్మకంగా పోలింగ్‌ను నిర్వీర్యం చేసిందన్నారు. చాలా డివిజన్లలో ఉద్దేశపూర్వకంగా ఓట్లను తొలగించారని ఆమె పేర్కొన్నారు. పోలింగ్ బూత్‌లలో కోవిడ్ జాగ్రత్తలు కనిపించలేదన్నారు.