కేసీఆర్‌కు సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నా: విజయశాంతి
ABN , First Publish Date - 2020-04-07T15:27:05+05:30 IST
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న లాక్‌డౌన్ కొనసాగింపు నిర్ణయానికి తాను సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నానని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న లాక్‌డౌన్ కొనసాగింపు నిర్ణయానికి తాను సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నానని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ప్రజా సంక్షేమం దృష్ట్యా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె వెల్లడించారు. ‘‘ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లాక్ డౌన్‌కు మధ్య విరామం ఇవ్వవద్దని, మొత్తంగా కొనసాగించాలని తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తుత పరిస్థితులలో ప్రజాసంక్షేమం దృష్ట్యా సంపూర్ణంగా సమర్ధిస్తున్నాను’’ అని విజయశాంతి పేర్కొన్నారు.