అదుపు తప్పితే ఆపగలిగే పరిస్థితి లేదు: విజయశాంతి

ABN , First Publish Date - 2020-03-24T13:31:53+05:30 IST

హైదరాబాద్: కరోనా వ్యాప్తిపై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఆమె సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు.

అదుపు తప్పితే ఆపగలిగే పరిస్థితి లేదు: విజయశాంతి

హైదరాబాద్: కరోనా వ్యాప్తిపై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఆమె సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా మారిందని.. ప్రజలంతా వివేకంతో వ్యవహరించాలని ఆమె కోరారు. ‘‘మనం ఇటలీ, అమెరికా, స్పెయిన్ లాంటి చాలా దేశాలకన్నా వైద్యపరంగా గొప్పోళ్లం ఏమీ కాదు. అజాగ్రత్తతో వచ్చిన పరిణామాల వల్ల తక్కువ జనాభా ఉన్న ఆ దేశాలు కూడా అల్లాడిపోతున్నాయి.


మన దేశంలో అదుపు తప్పితే, ఆపగలిగే పరిస్థితులు లేవు. పంజాబ్ ఎందుకు కర్ఫ్యూ విధించిందో ఆలోచించాలి. మన రాష్ట్రాలలో కూడా అంతకన్నా తీవ్ర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తెలంగాణలో ఇప్పటికే సంఖ్య 33 దాటింది. వైరస్ వ్యాప్తి ప్రారంభం కావడం ప్రస్తుత పరిస్థితిని ఎంతో ఆందోళనకరంగా మార్చింది. ప్రజలారా ఆలోచన చెయ్యండి. వివేకంతో వ్యవహరించండి’’ అని విజయశాంతి పోస్ట్ పెట్టారు. 

Read more