ఆయనను ఎవరూ నమ్మరు..: విజయశాంతి

ABN , First Publish Date - 2020-12-14T02:05:19+05:30 IST

మోసాల కేసీఆర్‌ను ఢిల్లీలో ఎవరూ నమ్మే పరిస్థితి లేదని బీజేపీ నాయకురాలు విజయశాంతి వ్యాఖ్యానించారు.

ఆయనను ఎవరూ నమ్మరు..: విజయశాంతి

హైదరాబాద్:  మోసాల కేసీఆర్‌ను ఢిల్లీలో ఎవరూ నమ్మే పరిస్థితి లేదని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం హోదాలో అపాయింట్‌మెంట్‌ తీసుకొని.. ప్రజలను బకరాలు చేసేందుకే ఈ ప్రయత్నం చేశారని మండిపడ్డారు. త్వరలో అవినీతి ఆరోపణలు రుజువవుతాయని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ ప్రభుత్వం కూలడం ఖాయమని చెప్పారు. ప్రజలు మార్పుకోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ రైతుల సంక్షేమానికి ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. నూతన వ్యవసాయ చట్టాలపై రైతులకు ఎంతగానో మేలు చేస్తాయని తెలిపారు.

Updated Date - 2020-12-14T02:05:19+05:30 IST