ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతున్నా: విజయశాంతి

ABN , First Publish Date - 2020-03-25T15:41:49+05:30 IST

సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఆమె.. ప్రభుత్వాలు, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు లాక్‌డౌన్ గురించి హెచ్చరిక స్వరంతో చేసిన విజ్ఞప్తిని

ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతున్నా: విజయశాంతి

హైదరాబాద్: కరోనా వైరస్‌‌ను అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడంపై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి స్పందించారు. సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు లాక్‌డౌన్ గురించి హెచ్చరిక స్వరంతో చేసిన విజ్ఞప్తిని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. లాక్‌డౌన్‌కు, కర్ఫ్యూకు నిర్ణయ వ్యత్యాసం ప్రజలపైనే ఆధారపడి నిర్దేశితమవుతుందన్నారు. దేశాన్ని మరింత సంక్లిష్టతకు గురి చెయ్యవద్దన్నారు. వైద్య విభాగ పరిస్థితి, పరిమాణాల ప్రామాణికత, అంతర్జాతీయ స్థాయిలో లేవని గుర్తించాలన్నారు. ప్రభుత్వాల అభ్యర్థనను అర్థం చేసుకుని ఆచరించండని ప్రజలను ఉద్దేశించి చెప్పారు. తన వంతుగా అవగాహన కల్పించేందుకు గత కొన్ని రోజులుగా చేస్తున్న ఈ ప్రయత్నం ప్రజలకు మేలు చెయ్యాలని కోరుకుంటున్నాన్నారు. Read more