గంప గోవర్ధన్ ప్రతిష్టకు భంగం కలిగేలా వీడియో.. కేసు నమోదు
ABN , First Publish Date - 2020-06-25T21:08:44+05:30 IST
కామారెడ్డి: కామారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రతిష్టకు భంగం కలిగేలా బీబీపేట మండల వాసి ఒకరు వీడియో క్రియేట్ చేశారు

కామారెడ్డి: కామారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రతిష్టకు భంగం కలిగేలా బీబీపేట మండల వాసి ఒకరు వీడియో క్రియేట్ చేశారు. ఆపరేషన్ దుర్యోధన సినిమాలో శ్రీకాంత్ చేసిన అవినీతి ప్రమాణ స్వీకారాన్ని గంప గోవర్ధన్ చేసినట్టుగా వీడియో క్రియేట్ చేశారు. సంబంధిత వ్యక్తిపై బీబీ పేట పోలీసులు కేసు నమోదు చేశారు.