రైతుల సమస్యలు తెలుసుకున్న ఉపరాష్ట్రపతి
ABN , First Publish Date - 2020-05-17T09:10:50+05:30 IST
రాజకీయంగా ఇరువురూ బద్దశత్రువులైనప్పటికీ, ఉపరాష్ట్రపతి వంటి ఉన్నత పదవిలో ఉన్న ముప్పవరపు వెంకయ్య నాయుడు తన చిరకాల మిత్రుడికి ఫోన్‌చేసి తన మిత్రత్వాన్ని చాటుకున్నారు.

మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డికి వెంకయ్య ఫోన్
యాచారం, మే 16: రాజకీయంగా ఇరువురూ బద్దశత్రువులైనప్పటికీ, ఉపరాష్ట్రపతి వంటి ఉన్నత పదవిలో ఉన్న ముప్పవరపు వెంకయ్య నాయుడు తన చిరకాల మిత్రుడికి ఫోన్‌చేసి తన మిత్రత్వాన్ని చాటుకున్నారు. రంగారెడ్డి జిల్లా యాచారానికి చెందిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి రాజకీయాలు పక్కనపెట్టి వెంకయ్యనాయుడితో సన్నిహితంగా మెలిగేవారు. పార్టీలు వేరైనా వెంకయ్య నాయుడు తన పాత మిత్రుడ్ని మరువలేదు. కోదండరెడ్డికి ఆయన శనివారం ఫోన్‌చేసి మాట్లాడారు. చిన్నప్పటి నుంచి కాంగ్రె్‌సలో ఉండి రైతుల సమస్యలపై పోరాటం చేయడం అభినందనీయమని అన్నారు. రైతులకు ఏం చేస్తే కష్టాలు తీరుతాయని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని సూచనలు చేశారు. నగరం వచ్చినప్పుడు కలవాలని కోరారు. పదవుల కంటే స్నేహం ముఖ్యమని చెప్పడంతో కోదండరెడ్డి ఎంతో సంబరపడ్డారు.