దేశాభివృద్ధికి చిన్నారుల సంక్షేమమే పునాది

ABN , First Publish Date - 2020-09-05T09:25:04+05:30 IST

దేశాభివృద్ధికి చిన్నారుల సంక్షేమమే పునాది

దేశాభివృద్ధికి చిన్నారుల సంక్షేమమే పునాది

  • పిల్లలకు పౌష్టికాహారం అందించాలి: వెంకయ్య

న్యూఢిల్లీ, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్యభారత నిర్మాణంలో భాగంగా చిన్నారులకు సరైన పౌష్టికాహారాన్ని అందించడం అత్యంత కీలకమైన అంశమని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. శుక్రవారం ఢిల్లీలో ‘స్టేట్‌ ఆఫ్‌ యంగ్‌ చైల్డ్‌ ఇన్‌ ఇండియా’ అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడారు. చిన్నారుల్లో పౌష్టికాహార సమస్యలు రాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాయని, ఇందులో పౌర సమాజం భాగస్వామికావాలని పిలుపునిచ్చారు. కాగా, కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఉపరాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలిశారు. 

Updated Date - 2020-09-05T09:25:04+05:30 IST