ఇంట్లోనే వినాయక చవితి: వెంకయ్య
ABN , First Publish Date - 2020-08-22T08:43:02+05:30 IST
వినాయక చవితి వేడుకలను ఇంట్లోనే జరుపుకోవాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
న్యూఢిల్లీ/హైదరాబాద్, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): వినాయక చవితి వేడుకలను ఇంట్లోనే జరుపుకోవాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సమభావనకు ప్రతీకగా నిలిచే వినాయక చవితి ద్వారా సంఘ సంస్కర్త బాలగంగాధర్ తిలక్ జాతీయ భావనను వ్యాప్తి చేశారని తెలిపారు. మట్టితో విగ్రహాలతో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కరోనా మార్గదర్శకాలను పాటి స్తూ ఇళ్లలోనే పండగ జరుపుకోవాలని పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని కాపాడుకునే దిశగా కంకణబద్ధులు కావాలని సూచించారు. కాగా, కరోనా నిబంధనలకు లోబడి భక్తి శ్రద్ధలతో గణేష్ ఉత్సవాల్ని జరుపుకోవాలని తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్ర శర్మ కోరారు. ప్రతి ఒక్కరు తమ ఇంటినే ఆలయంగా భావించి గణపతిని పూజించాలన్నారు. చిన్నపాటి మట్టిగణపతిని పూజించి.. తులసి చెట్టు వద్ద నిమజ్జనం చేయాలని సూచించారు.