చెడు పై మంచి సాధించిన విజాయానికి చిహ్నం దసరా- ఉపరాష్ట్రపతి

ABN , First Publish Date - 2020-10-24T23:54:29+05:30 IST

చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా దేశ వ్యాప్తంగా ఆనందోత్సాహాల మధ్య దసరా పండుగను వైభవోపేతంగా జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోందని

చెడు పై మంచి సాధించిన విజాయానికి చిహ్నం దసరా- ఉపరాష్ట్రపతి

హైదరాబాద్‌: చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా దేశ వ్యాప్తంగా ఆనందోత్సాహాల మధ్య దసరా పండుగను వైభవోపేతంగా జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. సత్యనిరతుడు, ఏకపత్నీ వ్రతుడు , పితృవాక్య పరిపాలకుడు, అన్నింటికీ మించి ఆదర్శపాలకుడిగా మానవ ధర్మనిర్వహణకు మార్గదర్శిగా నిలిచిన శ్రీరామ చంద్రుడి గొప్పతనాన్ని ఈ పండుగ తెలియజేస్తుందన్నారు. విజయ దశమి (దసరా) పండుగ శుభ సందర్భంలో దేశ ప్రజలకు ఉపరాష్ట్రపతి శుభా కాంక్షలు తెలిపారు. నవరాత్రుల సమయంలోనే జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసుణ్ణి సంహరించిన గాధ కూడా చెడుపై మంచి సాధించిన విజయాన్నిసూచిస్తుంది. 


మహాభారతంలో పాండవులు తమ ఆయుధాలను తిరిగి బయటకు తీసిన రోజుగానూ విజయదశమి ఎంతో ప్రత్యేకమైనది. అందుకే రావణదహనం , శమీపూజ, ఆయుధ పూజ, దర్గాపూజ, గౌరీ పూజ,బతుకమ్మ , సిరిమాను ఉత్సవాలతో దేశ వ్యాప్తంగా దసరా నవరాత్రులను సంప్రదాయబద్దంగా జరుపుకుంటారని ఉపరాష్ట్రపతి తెలిపారు. 


అయితే ఈ ఏడాది కోవిడ్‌-19 మహమ్మారి నేపధ్యంలో దేశ ప్రజలంతా దసరా పండగను కోవిడ్‌ నియమనిబంధనలకు అనుగుణంగా, ప్రభుత్వ సూచనలను పాటిస్తూ కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి వద్దనే జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ పండుగ ద్వారా ప్రజలందరి జీవితాల్లో శాంతి, సామరస్యం వెల్లివిరిసి శ్రేయస్సునుకలుగ చేయాలని ఆకాంక్షిస్తున్నట్టు ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. 


Updated Date - 2020-10-24T23:54:29+05:30 IST