కరోనా కాలంలోనూ యురేనియం సర్వేకు జీవో ఇచ్చారు: వీహెచ్
ABN , First Publish Date - 2020-05-18T19:51:49+05:30 IST
అమరావతి: కరోనా కాలంలోనూ యురేనియం సర్వేకు జీవో ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్: కరోనా కాలంలోనూ యురేనియం సర్వేకు జీవో ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యురేనియం తవ్వకాలతో కృష్ణా నది ప్రాంతం కలుషితమవుతోందన్నారు. కరోనా కంటే యురేనియం డేంజర్ అని వీహెచ్ పేర్కన్నారు. యురేనియం తవ్వకాలను అడ్డుకోవడంలో జగన్, కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదన్నారు. యురేనియం తవ్వకాలపై ఇరు రాష్ట్రాల్లోని విపక్ష పార్టీలతో కలిసి పోరాటం చేస్తామని తెలిపారు. పోతిరెడ్డిపాడు విషయంలో ఇద్దరు సీఎంల మధ్య రహస్య ఒప్పందం జరిగిందని వీహెచ్ పేర్కొన్నారు.