నిన్నూ పోలీస్‌స్టేషన్‌లో కూర్చోబెట్టే రోజొస్తది

ABN , First Publish Date - 2020-06-04T09:17:55+05:30 IST

నిన్నూ పోలీస్‌స్టేషన్‌లో కూర్చోబెట్టే రోజొస్తది

నిన్నూ పోలీస్‌స్టేషన్‌లో కూర్చోబెట్టే రోజొస్తది

  • సీఎం కేసీఆర్‌పై వీహెచ్‌ ధ్వజం


హైదరాబాద్‌, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): ‘‘మాజీ హోంమంత్రి జానారెడ్డిని పోలీస్‌ స్టేషన్‌లో కూర్చోపెడతారా? అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నిన్ను కూడా పోలీస్‌ స్టేషన్లో కూర్చోబెట్టే రోజొస్తది’’ అని సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్‌ నేత వి.హన్మంతరావు మండిపడ్డారు. గాంధీభవన్‌లో పార్టీ నేత రాములునాయక్‌తో కలిసి బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలను అణగదొక్కే పనిలో పోలీసులు ఉన్నారని ఆరోపించారు. 

Updated Date - 2020-06-04T09:17:55+05:30 IST