తహసీల్దార్‌ నాగరాజు వెనుక పెద్ద శక్తులు: వీహెచ్

ABN , First Publish Date - 2020-08-20T09:00:31+05:30 IST

రెవెన్యూ చట్టాల్లో ఉన్న లోపాల వల్లే పేదలకు అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్‌ నేత వి.హనుమంతరావు ఆరోపించారు. తహసీల్దార్‌ నాగరాజు వెనుక పెద్ద

తహసీల్దార్‌ నాగరాజు వెనుక పెద్ద శక్తులు: వీహెచ్

మేడ్చల్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ చట్టాల్లో ఉన్న లోపాల వల్లే పేదలకు అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్‌ నేత వి.హనుమంతరావు ఆరోపించారు. తహసీల్దార్‌ నాగరాజు వెనుక పెద్ద శక్తులు ఉన్నాయని, ఏసీబీ అధికారులు అందరినీ బయటకు లాగాలని కోరారు. మేడ్చల్‌ జిల్లా కీసర మండలం రాంపల్లి దాయారలోని వివాదాదస్పద భూములను బుధవారం ఆయన పరిశీలించారు. పేదలకు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజకీయ నాయకులు, రెవెన్యూ అధికారుల అవినీతి తగ్గాలంటే రెవెన్యూ చట్టాల్లో మార్పులు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తప్పు చేస్తే ఉద్యోగాలు పోతాయన్న భయం కలగాలని అన్నారు. నూతన రెవెన్యూ చట్టం అమలులో ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రభుత్వాన్ని  ప్రశ్నించారు. కీసర దయారలో 94 ఎకరాల భూమి అన్యాక్రాంతమైందని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-08-20T09:00:31+05:30 IST