బాహాబాహీకి దిగిన పశు వైద్యాధికారులు

ABN , First Publish Date - 2020-07-11T08:36:46+05:30 IST

ఆదర్శంగా నిలవాల్సిన ప్రభుత్వ అధికారులు ఇద్దరూ తమ స్థాయిని మరిచి బాహాబాహికి దిగారు.

బాహాబాహీకి దిగిన పశు వైద్యాధికారులు

గద్వాల జిల్లాలో ఘటన


గద్వాల, జూలై 10 (ఆంధ్రజ్యోతి) : ఆదర్శంగా నిలవాల్సిన ప్రభుత్వ అధికారులు ఇద్దరూ తమ స్థాయిని మరిచి బాహాబాహికి దిగారు. ఒకరినొకరు దూషించుకొని, చొక్కాలు పట్టుకొని దాడి చేసుకున్నారు. ఈ ఘటన శుక్రవారం గద్వాల జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్త్తే..గద్వాల జిల్లా పశువైద్య కార్యాలయం ఆవరణలో పలు అభివృద్ధికి కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. అయితే ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ శ్రుతి ఓఝా అనుకోకుండా వచ్చారు. అయితే ఈ సమాచారం తనకు ఎందుకు ఇవ్వలేదని గద్వాల పశువైద్యాధికారి డాక్టర్‌ రమేశ్‌, జిల్లా పశువైద్యాధికారి డాక్టర్‌ ఆదిత్య కేశవ సాయిని అతని చాంబర్‌లోనే నిలదీశారు.


ఈ క్రమంలోనే ఒకరినొకరు దూషించుకొని, చొక్కాలు పట్టుకొని దాడి చేసుకున్నారు. ఈ సందర్భంలో కేశవ సాయి తన టేబుల్‌పైన ఉన్న నేమ్‌ప్లేట్‌తో కొట్టడంతో రమేశ్‌ తలకు గాయమైంది. దీనిపై రమేశ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు రమేశ్‌ తన చాంబర్‌లోకి వచ్చి దూషించడంతోపాటు చొక్కా పట్టుకొని దాడి చేశాడని కేశవ సాయి పేర్కొంటున్నారు. ఈ విషయంలో రమేశ్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

Updated Date - 2020-07-11T08:36:46+05:30 IST