జాయింట్‌ చెక్‌ పవర్‌ రద్దు చేయాలి

ABN , First Publish Date - 2020-07-19T08:27:01+05:30 IST

రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఉప సర్పంచులకు కల్పించిన జాయింట్‌ చెక్‌ పవర్‌ను ప్రభుత్వం రద్దు చేస్తూ వెంటనే ఆర్డినెన్స్‌ జారీ చేయాలని తెలంగాణ రాష్ట్ర...

జాయింట్‌ చెక్‌ పవర్‌ రద్దు చేయాలి

సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు వెంకటేశ్‌


బర్కత్‌పుర, జూలై 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఉప సర్పంచులకు కల్పించిన జాయింట్‌ చెక్‌ పవర్‌ను ప్రభుత్వం రద్దు చేస్తూ వెంటనే ఆర్డినెన్స్‌ జారీ చేయాలని తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు వెంకటేశ్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. జాయింట్‌ చెక్‌ పవర్‌ వల్ల రాష్ట్రంలోని సర్పంచులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, కనీసం వేతనాలు కూడా తీసుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో వైకుంఠధామం నిర్మాణాల పేరుతో సర్పంచులకు నోటీసులు జారీ చేస్తున్నారని, ఈ నోటీసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అధికంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ సర్పంచులకు అనేక ఆర్థిక సమస్యలు ఉన్నాయని, అలాంటి వారికి వైకుంఠధామ నిర్మాణ పనులు కేటాయించడం వల్ల మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గ్రామ పంచాయతీకి చెందిన ట్రాక్టర్‌, డీజీల్‌, కరెంట్‌ బిల్లులను సర్పంచులు మోయలేని స్థితిలో ఉన్నారని, వాటికి ప్రభుత్వం నిధులు నేరుగా మంజూరు చేయాలని ఆయన కోరారు. 

Updated Date - 2020-07-19T08:27:01+05:30 IST