పాలకుర్తి సోమన్నకు వెండి చెంబు

ABN , First Publish Date - 2020-12-14T04:38:13+05:30 IST

పాలకుర్తి సోమన్నకు వెండి చెంబు

పాలకుర్తి సోమన్నకు వెండి చెంబు

సోమన్నకు వెండి చెంబును బహూకరిస్తున్న భక్తులు 

పాలకుర్తి, డిసెంబరు 13: పాలకుర్తి శ్రీ సోమేశ్వరలక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి భక్తులు ఆదివారం వెండి చెంబును బహూకరించారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన బొజ్జ కృష్ణమూర్తి, విజయ దంపతుల కుమార్తె దివ్య రూ.16 వేలు విలువ గల (235 గ్రాములు) వెండి చెంబును బహూకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోమేశ్వరలక్ష్మీనర్సింహస్వామి తమ ఇలవేల్పు దైవమని, తమ కుమార్తె దివ్యకు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం రావడంతో స్వామి వారికి వెండి చెంబును బహూకరించామని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఈవో వీరస్వామి, అర్చకులు డీ.వీ.ఆర్‌ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-14T04:38:13+05:30 IST