ఘనంగా మహా లింగార్చన

ABN , First Publish Date - 2020-03-23T10:44:16+05:30 IST

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వరక్షేత్రంలో ఆదివారం మహా లింగార్చన ఘనంగా నిర్వహించారు. మాస శివరాత్రి సందర్భంగా ఆలయ స్థానాచార్యులు

ఘనంగా మహా లింగార్చన

వేములవాడ, మార్చి 22: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వరక్షేత్రంలో ఆదివారం మహా లింగార్చన ఘనంగా నిర్వహించారు. మాస శివరాత్రి సందర్భంగా ఆలయ స్థానాచార్యులు అప్పాల బీమా శంకర్‌ నేతృత్వంలో అర్చకులు స్వామివారి కల్యాణ మండపంలో మహాలింగార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా పిండితో రూపొందించిన ప్రమిదలను లింగాకారంలో అమర్చి దీపాలు వెలిగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు  పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-23T10:44:16+05:30 IST