వేములవాడలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ

ABN , First Publish Date - 2020-06-22T13:59:45+05:30 IST

వేములవాడ పట్టణంలో యువకుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. రాష్ డ్రైవింగ్ చేస్తూ వెళ్లిన యువకుడిని మరో యువకుడి ప్రశ్నించాడు. ఇద్దరు యువకుల స్నేహితులు సైతం

వేములవాడలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ

సిరిసిల్ల: వేములవాడ పట్టణంలో యువకుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. రాష్ డ్రైవింగ్ చేస్తూ వెళ్లిన యువకుడిని మరో యువకుడి ప్రశ్నించాడు. ఇద్దరు యువకుల స్నేహితులు సైతం రంగంలోకి దిగారు. దీంతో వివాదం మరింత ముదిరి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. అలా అరగంటపాటు వాగ్వాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా.. పోలీసుల ముందు కూడా ఇరువర్గాలు ఘర్షణకు పాల్పడ్డాయి. దీంతో పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. పది మందిపై కేసు నమోదు చేశారు.

Updated Date - 2020-06-22T13:59:45+05:30 IST