కరోనా టెస్ట్‌కు వాహనం సిద్ధం

ABN , First Publish Date - 2020-04-25T08:41:29+05:30 IST

కరోనా అనుమానితులకు ఇంటి వద్దే పరీక్షలు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. అందుకు అవసరమైన సంచార ..

కరోనా టెస్ట్‌కు వాహనం సిద్ధం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి):  కరోనా అనుమానితులకు ఇంటి వద్దే పరీక్షలు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. అందుకు అవసరమైన సంచార వాహనాన్ని వైద్య ఆరోగ్య శాఖ సిద్ధం చేసింది. శుక్రవారం ఈ మొబైల్‌ వ్యాన్‌ను కోఠిలోని ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయంలో అధికారులు పరిశీలించారు. వాహనంలో నమూనాలను భద్రపరించేందుకు అవసరమైన ఫ్రీజింగ్‌ సౌకర్యాలను కల్పించారు. ఒకటి రెండు రోజుల్లో దీనిని వినియోగంలోకి తీసుకురానున్నారు. 

Updated Date - 2020-04-25T08:41:29+05:30 IST