వేదిక్ వర్సిటీ వీసీగా సాగి సత్యనారాయణ
ABN , First Publish Date - 2020-06-01T09:40:31+05:30 IST
వేదిక్ వర్సిటీ వీసీగా సాగి సత్యనారాయణ
మల్కాజిగిరి, మే 31 (ఆంధ్రజ్యోతి): వేదిక్ మైక్రోబయాలజీ వర్చువల్ యూనివర్సిటీ(సూరత్)కి వైస్ చాన్సలర్‌గా మల్కాజిగిరికి చెందిన డాక్టర్ సాగి సత్యనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ వర్సిటీ చాన్సలర్ డాక్టర్ చక్రధర్ ఫ్రెండ్ ఉత్తర్వులు జారీ చేశారు. సత్యనారాయణ ఏకంగా తొమ్మిది డాక్టరేట్లు, 36 పీహెచ్‌డీలను చేసి గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించడం గమనార్హం. వైద్య వృత్తి, వేద విద్యలు, యోగా, ఆధ్యాత్మిక ప్రసంగాల వంటి పలు అంశాల్లోనూ ఆయన గిన్నిస్ రికార్డులను సాధించారు. కాగా.. తనను వీసీగా నియమించడం పట్ల సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. త్వరలో పదవీబాధ్యతలు స్వీకరించనున్నట్లు స్పష్టం చేశారు.