కరోనాపై అవగాహనకు షార్ట్‌ ఫిలిమ్స్‌

ABN , First Publish Date - 2020-04-24T10:31:28+05:30 IST

కరోనా మహమ్మారిపై అవగాహన కల్పించేందుకు ఇఫ్లూ వర్సిటీ షార్ట్‌ ఫిలిమ్స్‌ను రూపొందించిందని వీసీ సురేష్‌ కుమార్‌ తెలిపారు.

కరోనాపై అవగాహనకు షార్ట్‌ ఫిలిమ్స్‌

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారిపై అవగాహన కల్పించేందుకు ఇఫ్లూ వర్సిటీ షార్ట్‌ ఫిలిమ్స్‌ను రూపొందించిందని వీసీ సురేష్‌ కుమార్‌ తెలిపారు. వీటిని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి రమేష్‌ పొఖ్రియాల్‌ ట్విట్టర్‌లో పోస్టు చేశారని చెప్పారు. ఈ వీడియోలు హిందీ, ఇంగ్లిష్‌, తెలుగు, అరబిక్‌, చైనీస్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌, జపనీస్‌, కొరియన్‌, స్పానిష్‌ భాషల్లో అందుబాటులో ఉన్నాయని, కరోనాపై పోరాటానికి యూనివర్సిటీ సోషల్‌ రెస్పాన్సిబులిటీ ఫండ్‌ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

Updated Date - 2020-04-24T10:31:28+05:30 IST