కల్యాణ రాముడికి వసంతోత్సవ శోభ

ABN , First Publish Date - 2020-04-08T10:25:11+05:30 IST

భద్రాచలం దేవస్థానంలో జరుగుతున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీ సీతారామచంద్రస్వామికి వసంతోత్సవాన్ని శోభాయమానం గా నిర్వహించారు. ధ్వజారోహణం అనంతరం 8వ రోజు నూతన వధూవరులైన సీతారాములకు...

కల్యాణ రాముడికి వసంతోత్సవ శోభ

భద్రాచలం దేవస్థానంలో జరుగుతున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీ సీతారామచంద్రస్వామికి వసంతోత్సవాన్ని శోభాయమానం గా నిర్వహించారు. ధ్వజారోహణం అనంతరం 8వ రోజు నూతన వధూవరులైన సీతారాములకు వసంతోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. కాగా,  బుధవారం ఉదయం చక్రతీర్ధం, సాయంత్రం పూర్ణాహుతి, ధ్వజావరోహణ, ద్వాదశ ప్రదక్షిణలు నిర్వహించనున్నారు. దాంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. 

- భద్రాచలం

Updated Date - 2020-04-08T10:25:11+05:30 IST