ఓటుతోనే హక్కుల సాధన: వంగపల్లి
ABN , First Publish Date - 2020-07-08T08:16:44+05:30 IST
ఓటుతోనే హక్కుల సాధన: వంగపల్లి
ఉప్పల్, జూలై7 (ఆంధ్రజ్యోతి): మాదిగలు, మాదిగ ఉపకులాలు తమ సంపూర్ణ హక్కులను సాధించుకునేందుకు ఓటు హక్కును ఆయుధంగా మలుచుకోవాలని ఎమ్మార్పీఎస్ (టీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ అన్నారు. ఎమ్మార్పీఎస్ దండోరా ఉద్యమానికి మంగళవారంతో 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఎంఎ్‌సఎ్‌ఫఎఫ్ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో వంగపల్లి జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఫూలే, అంబేడ్కర్ చూపిన మార్గంలో నడుస్తోందని, ఓటు హక్కుతోనే మన జాతి ప్రయోజనాలు సాధించుకోవచ్చని అంబేద్కర్ చెప్పారని పేర్కొన్నారు.